![]() |
![]() |
.webp)
అండ్ ఫైనల్లీ డాన్స్ ని ఇష్టపడే వారందరి కోసం మరో షో "సూపర్ జోడి" పట్టాలెక్కేసింది. ఈ నెల 28 వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది. ఆ ప్రోమో ఫుల్ కలర్ ఫుల్ గా రిలీజ్ అయింది. ఒకప్పటి ఫేమస్ డేర్ అండ్ డాషింగ్ యాంకర్ ఉదయభాను ఈ షోని హోస్ట్ చేస్తోంది. ఇక ఈ షోకు ఎవర్ గ్రీన్ సొట్ట బుగ్గల సుందరి, చేప కళ్ళ చిన్నది నటి మీనా జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఆమెతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ మాస్టర్ రఘు, అందాల హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ కూడా జడ్జెస్ గా ఉన్నారు .
"సూపర్ జోడి ఎంటర్టైన్మెంట్ తో మేం రెడీ" అని ఉదయభాను షో టాగ్ లైన్ చెప్తూ దేవకన్యలా దర్శనమిచ్చింది. వెంటనే "ఇక్కడికి వచ్చింది మీనా 2 . 0 " అంటూ తన ఇంట్రడక్షన్ ఇచ్చింది మీనా. "మీరు నవ్వితే బుగ్గలకు భలే సొట్టలు పడతాయి" అని ఉదయభాను అనేసరికి కళ్ళజోడు పెట్టుకుని క్యూట్ గా నవ్వుతూ మీనా "డాన్స్ సరిగా చేయకపోతే వాళ్లకు పడతాయి సొట్టలు" అంటూ నవ్వుతూ డైలాగ్ వేసింది. ఆమె డైలాగ్ కి "యు ఆర్ వెరీ నాటీ" అంది శ్రీదేవి. ఇక రఘుమాస్టర్ గ్రాండ్ ఎపిసోడ్ లోనే మీనాకి బిస్కెట్ వేసేసారు.."పక్షుల్లో అందమైనది మీనా..నాకు ఇష్టమైనది మీనా" అనేసరికి మీనా తెగ సిగ్గుమొగ్గలైపోయారు. ఈ షోలో ఎనిమిది జోడీలు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. డ్రామా జూనియర్స్, తెలుగు మీడియం ఐస్కూల్ వంటి షోలను అందించిన జీ తెలుగు ఈ వారం నుంచి సూపర్ జోడి షోతో మరింత ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి రెడీగా రాబోతోంది.
![]() |
![]() |